శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘ఫిడే’ అధ్యక్షపైఠంపై విశ్వనాథన్‌ ఆనంద్‌

8 గంటల క్రితం

Viswanathan-Anand
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 09:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • దిగ్గజ గ్రాండ్‌‌మాస్టర్‌‌కు అరుదైన గౌరవం

చెన్నై: భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌కు అరుదైన గౌరవం లభించింది. చదరంగం ఆటలో సుదీర్ఘ అనుభవమున్న ఆనంద్ కు అంతర్జాతీయ చెస్ సమాఖ్య(ఫిడే) తాత్కాలిక అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ప్రస్తుత అధ్యక్షుడు అర్కాడీ ద్వొర్కోవిచ్‌పై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించడంతో ఫిడే ఈ నిర్ణయం తీసుకుంది. విశ్వనాథన్‌ ఆనంద్‌ ప్రస్తుతం ఫిడే ఉపాధ్యక్షునిగా ‌బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2012 నుంచి 2018 మధ్య కాలంలో రష్యా ఉపప్రధానిగా పనిచేసిన ఆర్కాడీ.. ఆపై ఫిడే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో గెలుపొందిన ఆయన.. 2022లో మళ్లీ విజయం సాధించడంలో ఆనంద్ కీలక పాత్ర పోషించారు. దాంతో.. విశ్వనాథన్‌ ఆనంద్‌‌కు ఫిడే ఉపాధ్యక్షుని బాధ్యతలు కట్టబెట్టింది. అయితే.. అర్కాడీపై ఆంక్షల నేపథ్యంలో అధ్యక్ష పదవి ఖాళీ కావడంతో.. ఉపాధ్యక్షుడైన ఆనంద్‌ను ఫిడే ప్రమోట్ చేసింది. తనను అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఆనంద్ ఫిడేకు ధన్యవాదాలు తెలిపాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్