హోరాహోరీ పోరులో ముఛోవాపై గెలుపు
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి అమెరికా యువ సంచలనం, 7వ ర్యాంకర్ కోకో గాఫ్ ప్రవేశించింది. సెంటర్ కోర్ట్‌లో గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో గాఫ్ మూడుసెట్ల హోరాహోరీ పోరులో చెక్ రిపబ్లిక్‌కు చెందిన 12వ సీడ్, ముఛోవాను ఓడించింది. తొలి సెట్‌ను 2-6తో ఓడిన గాఫ్.. ఆ తర్వాత సెట్‌ను 6-1తో చేజిక్కించుకుంది. నిర్ణయాత్మక మూడో, చివరి సెట్‌లోనూ గాఫ్ అంచనాలకు మించి రాణించింది. టైబ్రేకర్‌కు వెళ్లిన ఆ సెట్‌ను ఒక దశలో 2-6పాయింట్లతో వెనుకబడింది. ఆ తర్వాత పుంజుకొని 6-6తో స్కోర్‌ను సమయం చేసింది. అదే జోరుకు కొనసాగిస్తూ.. 10-8పాయింట్లతో ఆ సెట్‌ను గెలుచుకుకొని ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా ఈ పోటీలో గాఫ్ 2-6, 6-1, 7-6(10-8)తో ముఛోవా(చెక్)ను ఓడించి కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరింది. కోస్ట్ట్యూక్(ఉక్రెయిన్), నోస్కోవా(చెక్) రెండో సెమీస్ విజేతతో శనివారం జరిగే ఫైనల్లో టైటిల్‌కు తలపడనుంది. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్‌కు గాఫ్ చేరడం ఇదే తొలిసారి. గాఫ్.. 2025లో ఫ్రెంచ్ ఓపెన్, 2023లో యుఎస్ ఓపెన్ గెలిచిన గాఫ్.. కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్‌కు అడుగుదూరంలో నిలిచింది.








కామెంట్‌లు (0)