లండన్: సెమీస్‌కు చేరిన బ్రిటన్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఆటగాడు ఆర్దర్ ఫెరీ మరో సంచలనం సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బ్రిటన్ తరఫున వైల్‌కార్డ్‌తో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ బరిలోకి దిగిన పెర్రీ సెమీస్‌కు చేరిన తొలి బ్రిటన్ ఆటగాడినిగా ఇప్పటికే చరిత్ర సృష్టించాడు. సెమీఫైనల్స్ కు చేరడంతో ఆర్థర్ ఫెరీ వింబుల్డన్‌లో దేశానికి చివరి ఆశగా నిలిచాడు. ఫ్రాన్స్‌లో జన్మించిన ఈ బ్రిటన్ ఆటగాడు సింగిల్స్ డ్రాలో 5 అడుగుల 9 అంగుళాల ఎత్తులోపు ఉన్న 128 మంది పురుషులలో, ఫెరీ నాల్గవ అత్యంత పొట్టివాడు. ఫెరీ టెన్నిస్ ఆడినప్పుడల్లా మ్యాచ్ మధ్యలో ముక్కు నుండి రక్తం కారే సమస్యతో బాధపడుతుంటాడు. బుధవారం తొమ్మిదో సీడ్ ఫ్లావియో కోబోలీని వరుస సెట్లలో ఓడించి, పురుషుల సింగిల్స్ చరిత్రలో చివరి నలుగురిలోకి ప్రవేశించిన రెండో వైల్డ్‌కార్డ్ ఆటగాడిగా నిలిచాడు. సెంటర్ కోర్టులో జరిగిన ప్రీ క్వార్టర్‌ఫైనల్లో గ్రిగోర్ డిమిట్రోవ్‌పై ఐదు సెట్ల విజయం సాధించాడు. ఆ మ్యాచ్‌లో అతను నాలుగో సెట్‌లో రెండుసార్లు బ్రేక్ డౌన్ నుండి పుంజుకుని, మాజీ ప్రపంచ నంబర్ 3 ఆటగాడిని ఆశ్చర్యపరిచాడు. క్వార్టర్ ఫైనల్లో కోబోలిని వరుససెట్లలో ఓడించి సెమీస్‌కు చేరాడు. . సెమీఫైనల్‌లో ప్రపంచ నంబర్ 2 అలెగ్జాండర్ జ్వెరెజ్‌తో తలపడనున్నాడు. బ్రిటన్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ చరిత్రలోనే అత్యంత చేదు సంఘటన వింబుల్డన్ టోర్నీ ప్రారంభానికి ముందు జరిగి. టోర్నమెంట్ ప్రారంభానికి ముందురోజు జాక్ డ్రేపర్ మరియు ఎమ్మా రాడకా టోర్నీనుంచి వైదొలిగారు. దీంతో ఫెరీ వైల్డ్‌కార్డ్ ఎంటీతో వింబుల్డన్ బరిలోకి దిగాడు. ఫెర్రీ సెమీస్‌కు చేరగా.. ఇతర స్వదేశీయులెవరూ సింగిల్స్ పోటీలో రెండో రౌండ్‌ను దాటలేకపోయారు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో ఆర్దర్ ఫెరీ ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్, 2వ సీడ్, జర్మనీకి చెందిన జ్వెరేవ్‌తో తలపడనున్నాడు.








కామెంట్‌లు (0)