మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionWomen's Hockey World Cup : ​మహిళల చారిత్రాత్మ‌క‌ విజ‌యం

2 గంటల క్రితం

hokey-2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 10:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • దక్షిణాఫ్రికాపై 6-1 గోల్స్‌తో గెలుపు

బ్రసెల్స్(బెల్జియం): మహిళ‌ల హాకీ ప్రపంచక‌ప్‌లో భారతజట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి మ్యాచ్‌‌లో పటిష్ట చైనాను నిలువరించిన సలీమా తేతే సారథ్యంలోని భారతజట్టు.. మంగళవారం జరిగిన పూల్‌-‌డి రెండో లీగ్‌ ‌మ్యాచ్‌‌లో దక్షిణాఫ్రికాపై 6-1గోల్స్‌ ‌తేడాతో ఘన విజయం సాధించింది. హాకీ ప్రపంచకప్‌‌లో భారత మహిళలజట్టు ఒక జట్టుపై 6గోల్స్‌ ‌చేయడం ఇదే తొలిసారి. దీంతో చారిత్రాత్మక విజయాన్ని నమోదుచేసుకొని రికార్డుల్లోకెక్కింది. ఈ మెగా టోర్నీ చ‌రిత్ర‌లో ఇంతకుముందు 1974లో స్పెయిన్‌పై 4-1 విజ‌య‌మే భార‌త్‌కు అత్యుత్త‌మం. ఆట మొద‌లు నుంచి దూకుడు క‌న‌బ‌రిచిన భార‌త అమ్మాయిలు ప్ర‌త్య‌ర్థి గోల్ పోస్ట్‌పై దండ‌యాత్ర చేశారు. సునేలితా టొప్పో, న‌వ్నీత్ కౌర్, సుశీలా చాను, ల‌ల్రేమిసియామి, సాక్షి రానాలు త‌లా ఒక గోల్ కొట్టారు. ఈ విజ‌యంతో 4 పాయింట్లు సాధించిన‌ టీమిండియా అగ్ర‌స్థానం ద‌క్కించుకుంది. మ‌రో మ్యాచ్‌లో చైనా ఇంగ్లండ్‌ను ఓడించింది. ఇక చివ‌రి గ్రూప్ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు గురువారం ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌‌ను డ్రా చేసుకుంటే టీమిండియా టాప్‌-2లో నిలవడం ఖాయం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్