సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ

1 గంట క్రితం

Groundbreaking ceremony for the construction of LV Prasad Eye Hospital in Amaravati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 03:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు) : రాజధాని అమరావతిలో ఎల్ వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి రానున్న బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలోని ఈ-03 రోడ్, సీడ్ యాక్సెస్ రోడ్డు ఎన్-14 జంక్షన్ వద్ద సర్వే నంబర్లు 51, 52, 55లో సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఈ నేపధ్యంలో కార్యక్రమానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వాహనాల రాకపోకలు, బందోబస్తు తదితర అంశాలపై ముందస్తు సమన్వయం కోసం సోమవారం ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించిన స్థలం వద్ద ఎ ఎస్ ఎల్ (అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా కలెక్టర్ సాయి శ్రీకాంత్ వర్మ, ఎస్ పి వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తదితర ఉన్నతాధికారులు పాల్గొని ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన భద్రతా, పరిపాలనా, ట్రాఫిక్ ఏర్పాట్లపై సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్