సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సనప జడ్పీ హై స్కూల్లో విద్యార్థులకు తాగు నీటి సమస్య

47 నిమిషాల క్రితం

school
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 03:19 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం


  • సనప జడ్పీ హై స్కూల్లో విద్యార్థులకు తాగు నీటి సమస్య

  • పట్టించుకోని ప్రధానోపాధ్యాయులు


ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారు చేస్తున్నట్లు ఊపదంపుడు ఉపన్యాసాలు ఇస్తాయి తప్ప క్షేత్రస్థాయిలో చూస్తే ఎందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి అందుకు ఉదాహరణ అనంతపురం జిల్లాలోని ఆత్మకూరు మండల పరిధిలో సనప జిల్లాపరిషత్ హై స్కూల్ నందు విద్యార్థులకు గత 15 రోజులుగా తీవ్ర నీటి సమస్య ఎదుర్కోoటు న్నారు. హై స్కూల్ లో త్రాగు నీరు అందించే బోరు సైతం రిపేరి కి వచ్చినా పాఠశాల నిర్వహుకులు తమకు ఏమి పట్టనట్లు ఉండడం తో విద్యార్థులు ఇంటి వద్ద నుంచి వాటర్ బాటిల్ లో విద్యార్థులు నీరు తెచ్చు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ వేడిమి తా లలేక గా ఇంటి నుంచి తెచ్చుకున్న నీరు అయిపోయి విద్యార్థులు త్రాగు నీటి కోసం ద ప్పిక తీర్చు కోవడం కోసం అవస్థలుపడుతున్నారు. గతం లో విద్యార్థులు మంచి నీరు అందించాలని ఉద్దేశ్యం తో హై స్కూల్ కు దాత వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. కానీ అది చెడిపోవడంతో మరమ్మత్తు లు కు నోచుకోలేదు. సంబందించిన పాఠశాల ప్రధానోపాద్యులు చెడి పోయినా వాటర్ ప్లాంట్ ను మర్మతులు చేయించ క మిన్నకుండి పోయారు. ఇప్పుడు పాఠశాలకు ఉన్న బోరు సైతం రిపేరి చేయించ క పోవడం తో విద్యార్థులు త్రీవ ఇబ్బందులు పడుతున్నారు. హెఎం మరమ్మతి చేయించుకోవడంతో విద్యార్థులు తీవ్ర త్రాగు నీటి సమస్య ఎదుర్కొంటున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రయివేట్ పాటశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల లను తీర్చిదిద్దుతామంటే ఇలాగేనా. కనీసం స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 గాని, గణతంత్ర దినోత్సవం జనవరి 26 లాంటి పండుగల్లో పాఠశాల్లో విద్యార్థుల కు ఆరోజు ప్రత్యక త త్యాగ ధనులు జీవిత విశేషాలు చెప్పి విద్యార్థులు కు మిఠాయులు పంచడం అనవాయితీ కానీ ఇలాంటి వాటి కోసం ప్రభుత్వం నిధులు సైతం సంబంధిత పాట శాలలకు వస్తాయి. కానీ ఒకరోజు కూడా పిల్లలకు బిస్కెట్ కూడా పంచలేదని స్థానికులు చెబుతున్నారు. విద్యార్థులు ఎంతో ఇష్టంగా చేపట్టేసరస్వతి పూజకు చేయడానికి కూడా ఈ పాఠశాల హెచ్ఎం సహకరించదని విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్న అధికారులు సనుప జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించి విద్యార్థులకు తాగునీటితోపాటు మౌలిక సదుపాయాలు కల్పనకు దృష్టి సారించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఒంటెత్తు పోకడల వల్ల అటు విద్యార్థులు పాఠశాల సిబ్బంది ఎంతో ఆందోళన చెందుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

school


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్