ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

WWE:స్టార్‌ బ్రాన్‌సన్‌ రీడ్‌ కన్నుమూత

1 రోజు క్రితం

WWE Star Bronson Reed passes away
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 10:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు డబ్ల్యూడబ్ల్యూఈ ప్రకటన

ప్రముఖ రెజ్లింగ్‌ సంస్థ వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్‌ బ్రాన్‌సన్‌ రీడ్‌ (38) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందినట్లు డబ్ల్యూడబ్ల్యూఈ సంస్థ ధ్రువీకరించింది. రీడ్‌ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

ఈ నెల 7న సౌదీ అరేబియాలో జరిగిన ‘క్రౌన్‌ జెవెల్‌’ షోలో బ్రాన్‌సన్‌ రీడ్‌ పాల్గొన్నారు. ఆ లైవ్‌ ఈవెంట్‌లో మరో రెజ్లర్‌ ఆయనను పైకెత్తి టేబుల్‌పై పడేయడంతో తీవ్రంగా గాయపడినట్లు, అనంతరం ఆస్పత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆ ఘటనలో జరిగిన గాయాల వల్లే రీడ్‌ మృతి చెందలేదని డబ్ల్యూడబ్ల్యూఈ స్పష్టం చేసింది.

ఆస్ట్రేలియాకు చెందిన రీడ్‌ 2007లో రెజ్లింగ్‌ కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన అసలు పేరు జెర్మైన్‌ హేలీ. 2019లో డబ్ల్యూడబ్ల్యూఈలోకి అడుగుపెట్టారు. 2021లో ‘ఎన్‌ఎక్స్‌టీ నార్త్‌ అమెరికన్‌ ఛాంపియన్‌షిప్‌’ను గెలుచుకున్నారు. రీడ్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆయన భార్య గర్భవతిగా ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్