శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మనసున్నోడివయ్యా..!

1 గంట క్రితం

You have a good heart!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 01:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

క్రీడలు : వయసులో చిన్నవాడైనా తన ప్రతిభతో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులోనే అరంగేట్రం చేసి రికార్డులు సృష్టించిన వైభవ్, ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేని విద్యార్థులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో “గొప్ప విషయాలు రాబోతున్నాయి.. చూస్తూ ఉండండి” అంటూ వైభవ్ చేసిన పోస్టు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆ ఉత్కంఠకు తెరదించుతూ శనివారం ఉదయం వైభవ్ కీలక ప్రకటన చేశారు. ఎక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా తనకు వచ్చే ఆదాయాన్ని అవసరమైన విద్యార్థుల విద్య కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యను ఆర్థిక సమస్యల కారణంగా కొనసాగించలేకపోతున్న అర్హులైన విద్యార్థులు తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. “ఆర్థిక ఇబ్బందులతో చదువుకు ఆటంకం కలుగుతున్న విద్యార్థులకు నాకు చేతనైనంత సాయం చేస్తాను. వారికి మద్దతుగా నిలిచేందుకు ప్రయత్నిస్తాను” అని వైభవ్ తన పోస్టులో పేర్కొన్నారు. చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. “మైదానంలోనే కాదు.. మంచి మనసుతోనూ గెలుస్తున్నావు”, “మనసున్నోడివయ్యా” అంటూ పలువురు వైభవ్‌ను అభినందిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్