న్యూఢిల్లీ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా .... దేశ క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోడి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారుల అంకితభావం, పట్టుదలను ప్రశంసిస్తూ.. యువతను ప్రేరేపించడంలో క్రీడల పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. క్రీడాభిమానుల అభిరుచి దేశం గర్వించేలా చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళులర్పించారు. ధ్యాన్‌చంద్ ప్రతిభ తరతరాలకు స్ఫూర్తినిస్తోందని తెలిపారు. కాగా, ప్రతి ఏడాది ఆగస్టు 29న మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ కూడా దేశ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలు కేవలం గెలుపు కోసం మాత్రమే కాదని ఆయన అన్నారు. కలలు కనడం, కష్టపడి పనిచేయడం, వైఫల్యాలను ఎదుర్కోవడం, వాటిని అధిగమించి ముందుకు సాగడం వంటి జీవిత పాఠాలను క్రీడలు నేర్పుతాయని చెప్పారు. ఎక్కువ మంది యువత క్రీడల్లో పాల్గొనాలని ధవన్ పిలుపునిచ్చారు.
దేశ క్రీడాకారులకు ప్రధాని మోడి శుభాకాంక్షలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 29, 2026, 12:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)