శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పుట్లూరులో నీటి కష్టాలు తీరేనా...?

55 నిమిషాల క్రితం

Will the water woes in Putlur be resolved?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 02:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : పుట్లూరులో నీటి కష్టాలు తీరేనా అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. పుట్లూరు గ్రామం నందు చెరువు ఉన్నా లేనట్లే అన్నట్లుగా ఉంది. చెరువుకు నీరు వస్తే ఎదో ఒక 4-5నెలలు మాత్రమే నీటి కష్టాలు ఉండవు, మిగిలిన 7-8నెలలు ఈ నీటి కష్టాలు గ్రామ ప్రజలకు తప్పవు, పేరుకు మాత్రమే పుట్లూరు మండలం. మండల హెడ్ క్వార్టర్ లోనే ఇలా ఉంటే మిగిలిన గ్రామాల పరిస్థితి ఎలా ఉందో తెలీయట్లేదు. మండల కేంద్రంలో సగం ఊరికి పైగా తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు మాత్రం మండల కేంద్రానికి ఇన్ని వేల లీటర్లు పంపిణీ చేస్తున్నామని లెక్కలు చెబుతున్నారు కానీ పుట్లూరులో మాత్రం తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా కోటవీధి, బీసీ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో ప్రజలు తాగునీటి కోసం చుట్టుపక్కల ఉన్న మోటార్ల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. మండల కేంద్రంలోని త్రాగునీటి సమస్య ఇలా ఉంటే గ్రామాలలో ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇప్పటికైనా మండల అధికారులు త్వరగా స్పందించి పుట్లూరు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్