‘అత్తమ్మ’ అనుమాట
ఉత్తమోత్తమము!
అత్తలో అమ్మ కల
దనెడి అనుభవము!!
ఉత్తరప్రదేశ్లోన
ఉన్నదా ఊరు!
అందులో ‘పూజ’యను
నామెకొక మారు
కాన్పు సమయమ్మునా
కష్టమొచ్చినది!
చీముపట్టీ కిడ్ని
చెడిపోయినదా!!
ప్రాణాలు పోవునని
భయమేసి నాది!
అపుడామెను అత్తే
ఆదుకున్నాది!!
తన కిడ్ని పూజకూ
దానమిచ్చింది!
జగతి పూజకు మరో
జన్మనిచ్చింది!!
అత్తలోనే అమ్మ
అగుపించెనపుడు!
అత్త తనకందుకే
‘అత్తమ్మ’ ఇపుడు!!








కామెంట్లు (0)