ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభిన్నత్వంలో ఏకత్వం

1 గంట క్రితం

ఎస్_విఆర్_ మెమోరియల్_ ఇంగ్లీషు మీడియం 2.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 08:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మన దేశం అనేక భాషలు, మతాలు, కులాలు, సంస్కృతులు, సంప్రదాయాలతో కూడిన వైవిధ్యభరితమైన దేశం. అయినప్పటికీ మనమంతా భారతీయులమనే భావనతో ఐక్యంగా జీవించడమే దేశ సమగ్రత. ఒకరి భాషను, మతాన్ని, సంస్కృతిని మరొకరు గౌరవించాలి. కులం, మతం, ప్రాంతం పేరుతో భేదాలు చూపకుండా అందరినీ సమానంగా చూడాలి. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, పరస్పర గౌరవం ఎంతో అవసరం. విద్యార్థి దశ నుంచే దేశభక్తి, ఐక్యత, సహకారం వంటి మంచి విలువలను అలవర్చుకోవాలి. మన జాతీయ జెండా, జాతీయ గీతం, రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి ఉండాలి. దేశానికి ఏ సమస్య వచ్చినా మనమంతా ఒక్కటిగా నిలబడాలి. వైవిధ్యంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత. దేశ సమగ్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత. పై సందేశాన్ని మా పాఠశాలలో జరిగిన 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్‌ఆర్‌ఎస్‌వి బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆకెళ్ల సూర్య కనకదుర్గ గారు ఇచ్చారు. మా పాఠశాలలో జరిగిన వేడుకల్లో దేశభక్తి, జాతీయ స్ఫూర్తి, ఉత్సాహభరిత వాతావరణంలో కనిపించింది. ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం నాతోటి విద్యార్థులంతా ఉపాధ్యాయులు దేశభక్తిని ప్రతిబింబించే కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మేమంతా జాతీయ జెండాలు, త్రివర్ణ అలంకరణలతో ర్యాలీ నిర్వహించాము. మేమంతా ఎంతో క్రమశిక్ష‍ణతో చేసిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. పాఠశాల ప్రిన్సిపాల్ పిళ్లా విజయలక్ష్మి, కరస్పాండెంట్ రేవెల్ల శ్వేత అరుణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపింది.

మహమ్మద్‌ సాజియా,

7వ తరగతి, ఎస్‌విఆర్‌ మెమోరియల్‌ ఇంగ్లీషు మీడియం స్కూలు,

నిజాంపేట, వన్‌టౌన్‌, విజయవాడ.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్