ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమా పాఠశాలలో ఎన్నికలు

1 గంట క్రితం

hiranmai sai item photo.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 08:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఈ సంవత్సరం నేను పదో తరగతిలో చేరాను. కొద్ది రోజులకు మా పాఠశాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేనూ భాగం అయ్యాను. చాలా ఆనందంగా ఉంది. ఈ పోటీలు చాలా చక్కగా, ఆహ్లాదకరంగా జరిగాయి. రాజకీయ నాయకుల ఎన్నికలు ఏ విధానంలో జరుగుతాయో అదేవిధంగా మా పాఠశాలలో ఎన్నికల విధానం, ఓటింగ్ పద్ధతి ద్వారా కొనసాగింది. ఎన్నికలలో పాల్గొనడానికి చాలా మంది పిల్లలు ముందుకొచ్చారు. వారిలో నేనూ ఒకదాన్ని. పాఠశాలకు SPL గా పోటీ చేశాను. ఇప్పటివరకూ ఎటువంటి పోటీల్లో పాల్గొనలేదు. దాంతో ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. ప్రచారానికి వెళ్లినప్పుడు చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. నాకు అందరిముందూ మాట్లాడాలంటే చాలా భయం. కానీ ఈ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు నాకు తెలియకుండానే నాలో భయం పోయింది. ధైర్యంగా అందరిముందూ మాట్లాడాను. ఎన్నికల ప్రచారం ద్వారా పిల్లల యెక్క అవసరాలు తెలుసుకోవచ్చు. పిల్లల దగ్గరికి వెళ్లడం వల్ల, వారితో మాట్లాడినప్పుడు.. స్వతహాగా అలోచించడం నేర్చుకున్నాను. ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు మన పాఠశాలలో నిర్వహిస్తారని కోరుకుంటున్నాను.

కె. హిరణ్మయి సాయి

10వ తరగతి, అరవింద హైస్కూలు,

మంగళగిరి, గుంటూరు జిల్లా.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్