మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅరుదైన రికార్డులు సాధించా!

09 ఆగస్టు, 2026

bance
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 08:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హాయ్‌ ఫ్రెండ్స్‌
నాట్య కళలు అంటే నాకెంతో ఇష్టం. అందులోనూ భరతనాట్యం, కూచిపూడి అంటే మరింత ఇష్టం. ఇవేకాకుండా వెస్ర్టన్‌, ఫోక్‌ డాన్సులు కూడా వచ్చు. ఆత్మరక్ష‍ణ కళ అయిన కరాటే మార్షల్‌ ఆర్ట్సు, ఉఘ్ష టైక్వాండో, కర్రసాము, యోగా నేర్చుకుని ప్రావీణ్యం పొందాను. చదువుతోపాటుగా ఆట పాటల్లోనూ ముందంజలో ఉంటున్నాను. నృత్యంపై అభిరుచితో పలు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చాను. అటు తెలంగాణా, ఇటు ఆంధ్రాతోపాటుగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో కూడా పాల్గొని బహుమతులు అందుకున్నాను. రెండున్నర సంవత్సరాలుగా కళారంగంలో చేస్తున్న కృషికి గాను 250కి పైగా బహుమతులు అందుకున్నాను. భవిష్యత్తులో మరింత నిపుణత, నైపుణ్యాన్ని మేళవించి కళారంగంలో రాణించాలని ఆశిస్తున్నాను. పలు ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ఆధ్వర్యంలో జరిగిన కళాపోటీల్లో పాల్గొని, మంచి ప్రతిభ కనబర్చాను. ఢిల్లీలో నాచులె దివానే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని అద్వితీయ నృత్య ప్రదర్శన ఇచ్చాను. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో 5000 మంది నృత్యకారులతో కలిసి నేను నృత్యం చేశాను. నా పేరు కూడా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డు రికార్డుల్లో ఎక్కడం నాకెంతో గర్వంగా అనిపించింది. సమీక్ష ఆర్ట్స్ అకాడమీ వాట్సప్ లైఫ్ ద్వారా శిక్ష‍ణ పొందుతున్నాను.

సమీక్ష‍ చిన్నారి

7వ తరగతి, ఆల్ఫోన్సా పాఠశాల, రామకృష్ణాపూర్‌,

మంచిర్యాల జిల్లా, తెలంగాణ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్