ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబాక్సింగ్‌లో రాణిస్తా !

20 నిమిషాల క్రితం

బాక్సింగ్_లో నవ్య.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 07:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హాయ్‌ ఫ్రెండ్స్‌!

నేను పదో తరగతి చదువుతున్నాను. నాకు చదువుతో పాటు ఆటలంటే కూడా చాలా ఇష్టం. ముఖ్యంగా బాక్సింగ్‌ అంటే ఎంతో ఆసక్తి. బాక్సింగ్‌లో సాధన చేస్తూ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఈ పోటీల్లో బ్రాంజ్‌ మెడల్‌ సాధించడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఒక పతకం గెలుచుకోవడం వెనుక సాధన, కృషి ఎంతో ఉంటాయని అర్థమైంది. ఈ విజయం నాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. భవిష్యత్తులో ఇంకా బాగా సాధన చేసి మరిన్ని పతకాలు సాధించాలని అనుకుంటున్నాను.మా పాఠశాలలో ఆంగ్ల భాషా ఉపాధ్యాయులు గుడిపూడి సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు తుర్లపాటి నగేష్‌ తో పాటు పీడీ పి. సాంబశివరావు, పీఈటీ పి. హెప్సిబా నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వారు అందిస్తున్న ప్రోత్సాహం, సహకారం నాకు మరింత ధైర్యాన్నిస్తున్నాయి. బాక్సింగ్‌లో మరింత రాణించి మా పాఠశాలకు, మా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలనేది నా కోరిక.

బాక్సింగ్_లో నవ్య.jpg

మీ

ఎం. నవ్య

10వ తరగతి, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల,

మందడం,తుళ్లూరు మండలం, గుంటూరు జిల్లా​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్