హాయ్ మిత్రులారా...!
ప్రభుత్వ బడులంటే చిన్నచూపు చూడకండి. అవి విజ్ఞాన జ్ఞానబండాగారాలు. మా లాంటి భావి భారత పౌరులను తీర్చిదిద్దే విద్యాసౌధాలు. పిల్లల్లో జిజ్ఞాసను పెంచుతూ వారిలో ఆల్‌రౌండ్ అభివృద్ధికి పాటుపడుతున్నవి ఈ విద్యాలయాలు. ఏటేటా మా పాఠశాలలో విద్యాప్రమాణాలు బాగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మా పాఠశాల ఉపాధ్యాయులు ఎంతో అంకితభావంతో పనిచేస్తూ మమ్మల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి నిరంతరం పాటుపడుతున్నారు. ఈ ఏడాది కూడా మా పాఠశాలలలో 135 మంది కొత్త విద్యార్థులు చేరటం ఎంతో శుభపరిణామం. వారిలో ప్రయివేటు పాఠశాలల నుంచి చేరిన వారు 57 మంది వరకూ ఉన్నారు. అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు మా పాఠశాలను సందర్శించి మమ్మల్ని, మాకు విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయులను అభినందించటం మాకెంతో గర్వకారణంగా ఉంది. కొత్తగా చేరిన విద్యార్థులను డిఇఒ అభినందించటంతోపాటుగా అందరికీ చాక్లెట్లు పంపిణీచేసి అభినందించారు. మా పాఠశాల ఊధ్యాయుడు బి.వరప్రసాద్ గారు ఆయన ఇద్దరు పిల్లలను 7, 9 తరగతిల్లోనూ చేర్పించటం పట్ల అభినందించారు. ఆయనకు పుష్ప గుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అలాగే పాఠశాలను అభివృద్ధి పథం లో నడిపిస్తున్న మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ గారిని శాలువాతో సత్కరించారు. ఎఎస్‌ఒ వై.వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులంతా పాల్గొన్నారు. మా పురోభివృద్ధికి ఉపాధ్యాయులంతా ఎంతో సమన్వయంతో కృషిచేస్తుండటం మాకెంతో గర్వకారణంగా ఉంది.
ఇట్లుమామిడిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, అనకాపల్లి జిల్లా.








కామెంట్‌లు (0)