ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఎపిలో మద్యం దుకాణాల రెన్యువల్ గడువును ప్రభుత్వం ఈనెల 23వ వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఎపిలో మద్యం దుకాణాల రెన్యువల్ గడువును ఎ4 మద్యం దుకాణాల యజమానుల విజ్ఞప్తి మేరకు 2026–27 సంవత్సరానికి దుకాణాల రెన్యువల్ గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించింది. పలు షాపులు రెన్యువల్ చేసుకునేందుకు ఈ నెల 23వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎపి వ్యాప్తంగా 2026–27 సంవత్సరానికి 3,650 ఎ4 మద్యం దుకాణాలు నోటిఫై కాగా.. ఇప్పటివరకు 2726 షాపులు రెన్యూవల్ చేసుకున్నాయి. ఇప్పటి వరకు రూ.676 కోట్లను ఆయా షాపుల నుంచి ఎపి ప్రభుత్వం వసూలు చేసింది.
ఎపిలో మద్యం దుకాణాల రెన్యువల్ గడువు 23 వరకు పొడిగింపు
56 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)