సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొత్త ఓటర్ల నమోదుకు 4 పర్యాయాలు అవకాశం

59 నిమిషాల క్రితం

voter
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో ఏడాదికి 4 పర్యాయాలు ఓటర్ల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ ‌దండే సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితాలో పేరు నమోదుకు జనవరి ఒకటిని మాత్రమే క్వాలిఫైయింగ్ తేదీగా పరిగణించేవారు. దీంతో చట్ట సవరణకు ప్రభుత్వం నిర్ణయించగా, గత ఫిబ్రవరిలో అసెంబ్లీలో సవరణ ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. తాజా సవరణతో ఏడాదికి నాలుగు క్వాలిఫైయింగ్ తేదీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతియేటా జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబరు నెలల్లో ఒకటిన గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో నమోదుకు అవకాశం కల్పించారు. దీనివల్ల జనవరి 2 తర్వాత 18 ఏళ్లు నిండిన యువత ఏడాది పాటు వేచి చూడాల్సిన అవసరం లేదు. తదుపరి క్వాలిఫైయింగ్ తేదీ నాటికి ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. పార్లమెంటు, అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల తరహాలోనే ఇక పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒకే విధమైన ఓటరు జాబితా విధానం అమల్లోకి రానుంది. ఈ సవరణ ఈ నెల 25వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి గెజిట్‌‌లో ప్రచురణకు ముద్రణా శాఖ కమిషనర్‌‌ను ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్