శనివారం, 31 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రకృతి విపత్తులపై అవగాహనతో ప్రాణరక్షణ

-847 నిమిషాల క్రితం

Saving lives through awareness of natural disasters
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 07:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అలల రూపంలో ఆపదొస్తే అప్రమత్తతే మనకు రక్ష!

సముద్రం ఉప్పొంగి వస్తే సురక్షిత చోటే మనకు దిక్కు!!

భూమి కంపించి నేల కదిలినా

తుఫాను విరుచుకుపడి వచ్చినా

వరదలు ఊరిని ముంచినా

ధైర్యంతో ఎదుర్కొందాం అందరం!

సునామీ అంటే సముద్రపు అలలే కాదు

విధ్వంసం సృష్టించే మహా విపత్తు!

తీర ప్రాంతాలను తాకేలోపే హెచ్చరికలను

గమనించడం మన బాధ్యత!!

వరదలు వస్తే ప్రవాహం దాటొద్దు

విద్యుత్‌ తీగల దగ్గర నిలవొద్దు!

భూకంపం వస్తే కంగారు పడొద్దు

సురక్షిత పద్ధతులనే మరవొద్దు!!

విపత్తులు చెప్పి రావు

విజ్ఞానం మనల్ని కాపాడుతుంది!

ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే

అనేక ప్రాణాలు నిలుస్తాయి!!

ప్రతి ఇంటా అవగాహన ఉండాలి

ప్రతి మనసులో బాధ్యత పెరగాలి!

ప్రకృతి విపత్తులపై జ్ఞానం పెంచి

ప్రాణరక్షణలో భాగస్వాములం కావాలి!!

సునామీపై అవగాహన పెంచుదాం

విపత్తులను ధైర్యంగా ఎదుర్కొందాం!

ప్రాణాలను కాపాడే సందేశాన్ని ప్రపంచమంతా చాటిచెబుదాం!!


photo


మలిశెట్టి సాయి ప్రణవి

6వ తరగతి, కుమార్‌ సీబీఎస్‌ఈ స్కూల్‌,

నూజివీడు, ఏలూరు జిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్