పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కీర్తిశేషులు సరికొండ లక్ష్మమ్మ జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు, కుమారులు, బంధువులు గత పదకొండేళ్లుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 5, 6 తేదీల్లో సత్తెనపల్లి పట్టణంలోని రాజుల కాలనీలో సరికొండ లక్ష్మమ్మ 11వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష్మమ్మ పెద్ద కుమారుడు సరికొండ లెనిన్‌బాబు అధ్యక్షతన జరిగిన సభలో అభ్యుదయవాది గుంటూరు విజయకుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సరికొండ లక్ష్మమ్మ, రామలింగరాజు దంపతులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడంతోపాటు తమ కుమారులను ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులైన జాన్ వెస్లీ, దుగ్గి రాజేశ్వరి, పి. రాజ్యలక్ష్మి, ఎస్. సృజనాబాయి, త్రిణయ్ సాయి, నూర్‌భాషా, పవన్‌కుమార్‌లకు ఒక్కొక్కరికి రూ.6,200 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయం మా లాంటి పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. సరికొండ లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు ఎస్. రామకృష్ణరాజు, వెంకాయమ్మ, పద్మ, సంపత్, శ్రావ్య చందన, శివ, పావని, ఉదయ ఆదిత్య, శరత్‌చంద్ర తదితరులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

డి. రాజేశ్వరి,
డిగ్రీ విద్యార్థిని, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా.








కామెంట్‌లు (0)