బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionస్వేచ్ఛా సూర్యోదయం

23 ఆగస్టు, 2026

muvvennala janda.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 08:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

పోరాటాల హిమగిరిపై

ఎగిరిన త్రివర్ణ పతాకం,

నిరుపమ త్యాగమూర్తుల సాక్షిగా

ఉదయించెను స్వేచ్ఛా సూర్యుడు

పరాయి పాలన సంకెళ్లు తెంచి

స్వరాజ్య సాధనకై సాగిన సమరం,

వీరుల నెత్తుటి చుక్కలతో

పునీతమైనది ఈ భారత భూతలం!

భగత్‌సింగ్ ధైర్యం మా స్ఫూర్తి,

అల్లూరి విప్లవం మాకు ఆదర్శం

నేతాజీ నేతృత్వంలో నడిచిన,

విప్లవ భారతం నవ్య భారతం

మూడు రంగుల జెండా సాక్షిగా

మొదలయ్యెను నవభారత వికాసం

శాంతి, సత్యం, త్యాగాల బాటలో

సాగుతోంది మన భవిష్యత్ వికాసం!

కులమతాల భేదం మరచి

భారతీయులమని చాటుదాం,

ఐక్యతయే మన బలముగా నిలిపి

నవ భారతాన్ని నిర్మిద్దాం!

బెందాళం సిద్ధార్థ్‌

ముత్యాలపేట,

కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్