ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదాతల చేయూత అభినందనీయం

43 నిమిషాల క్రితం

tadepalli school
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 07:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మా పాఠశాల అభివృద్ధికి దాతలు చేస్తున్న కృషి అభినందనీయం. మేమంతా దాదాపుగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులమే. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు. మేము కూడా ఎంచక్కా చక్కగా చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాల్లో స్థిరపడాలనే భావనతో ఉన్నాం.ఇటీవల మా పాఠశాలలో జరిగిన ప్రత్యేక సమావేశంలో లోకం జనార్ధనరావు (న్యాయవాది), ఆయన కుమార్తె లోకం సాయి శ్వేత (జూనియర్ సివిల్ జడ్జి) మా పాఠశాల విద్యార్థులందరికీ రూ.15 వేలు విలువైన నోట్‌బుక్స్, కాపీ రైటింగ్ బుక్స్, టేబుల్ బుక్స్ తదితర విద్యా సామగ్రిని అందజేయటం మాకెంతో సంతోషంగా అనిపించింది. తెనాలి ఉప విద్యాశాఖాధికారి, తాడేపల్లి మండల విద్యాశాఖధికారిణి 1 జి. శాంతకుమారి, తాడేపల్లి మండల విద్యాశాఖాధికారి 2 డి.నాగేశ్వరరావులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని కొనియాడారు. మాకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా మా విద్యాభ్యాసానికి ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. సమాజంలోని మరెందరో దాతలు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల కమిటీ చైర్‌పర్సన్ జి.యేసమ్మ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు బట్టి సుధాకర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులంతా లోకం జనార్దనరావు, లోకం సాయి శ్వేతలను ఘనంగా సత్కరించారు. నా తల్లిదండ్రులు చైతన్య, వినతి పాఠశాల మరమత్తుల నిమిత్తం రూ.11వేలు విరాళంగా ఇచ్చారు.

సాత్విక్‌ వినతి చైతన్య,

1వ తరగతి, ఎంపిపిఎస్(ఎల్ఇ) పాఠశాల,

క్రిస్టియన్‌పేట, తాడేపల్లి మండలం, గంటూరుజిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్