ప్రియమైన వృక్షమా!
నాకు నువ్వు చాలా ఇష్టం. నువ్వు మాకు అన్ని విధాలుగా సహాయం చేస్తావు. నువ్వు మాకు అనేక రకాల పండ్లు, కూరగాయలు, పూలు, ఆకు కూరలు ఇలా అన్నీ ఇస్తావు. ఇంకా ముఖ్యంగా స్వచ్ఛమైన గాలి కూడా ఇస్తావు. ఆ గాలి ఇవ్వకపోతే మేము అస్సలు బతికేవారిమి కాదు. నువ్వు మాకు ఇవన్నీ ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. నీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నీకేం మేలు చేయగలను.. కానీ నీలాంటి వంద చెట్లు పెంచి, నీ రుణం తీర్చుకుంటాను. సరేనా మిత్రమా!
నా ప్రాణ వృక్షమా!
ధన్యవాదాలు
ఇట్లు
నీపై ఆధార పడ్డ నేను
జి. రష్మిత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మూడపల్లి, చందుర్తి, సిరిసిల్ల జిల్లా.








కామెంట్‌లు (0)