ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనైపుణ్యాలను పెంపొందించుకుంటున్నాం

42 నిమిషాల క్రితం

tech
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 07:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హాయ్‌ ఫ్రెండ్స్‌

నేర్చుకోవాలనే జిజ్ఞాస మమ్మల్ని సాంకేతికతవైపు పరుగులు తీయిస్తోంది. చదువులో సబ్జెక్టు అంశాల్లో ముందుంటున్న మేము అధునాతన సాంకేతికతలోని కృత్రిమ మేధ (AI - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. ప్రపంచం మొత్తం ఇప్పుడు మానవ మేధస్సును యంత్రాలు లేదా కంప్యూటర్ల ద్వారా అనుకరించే సాంకేతికత వైపు మొగ్గుచూపుతున్న విషయం తెలిసిందే. యంత్ర అభ్యాసం (ML - మెషిన్ లెర్నింగ్) అనేది ఏఐలో ఒక ముఖ్యమైన భాగం, ఇది యంత్రాలు డేటా ద్వారా స్వయంగా నేర్చుకోవడానికి సహాయపడుతోంది. ఎఐ కూడా మానవుల వలె ఆలోచించడం, సమస్యలను పరిష్కరించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులను కంప్యూటర్లు చేసేలా చేస్తుంది. వాయిస్ అసిస్టెంట్లు, మ్యాప్ నావిగేషన్, ఆటోమేటెడ్ సిస్టమ్స్ దీనికి ఉదాహరణలు. ఇది పెద్ద మొత్తంలో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి వేగంగా పనిచేస్తుంది. ఆటోమేషన్ మరియు రోబోటిక్స్ (Automation and Robotics) అనేది మానవ ప్రమేయం లేకుండా యంత్రాలు, సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ సిస్టమ్‌ల ద్వారా పనులను స్వయంచాలకంగా నిర్వహించే అధునాతన సాంకేతిక రంగం. ఇది పరిశ్రమల్లో ఉత్పాదకతను, కచ్చితత్వాన్ని, వేగాన్ని పెంచడానికి సహాయపడుతుందని రోబోటిక్సు నిపుణులు దాసరి నరేంద్ర గారు చెప్పారు. మా పాఠశాల డైరెక్టర్లు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, దేవయ యాదవ్‌, సిఇఒ రిత్విక్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ బెన్‌రాజ్‌ నేతృత్వంలో మాకు మంచి విద్య, సాంకేతిక విద్యాబోధనలు అందుతున్నాయి. ఇవే కాకుండా మ్యూజిక్‌, డ్యాన్సు, రోబోటిక్సు, ఆటలు, కరాటే వంటి అంశాల్లో ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. ప్రతినెలా మా ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా మెడికల్‌ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఒత్తిడిలేని జాయ్‌ఫుల్‌ లెర్నింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.


-కె.శ్రేష్ట, ఎస్‌కె హఫ్సా, 7వ తరగతి,

బి.చైతన్య, ఎం.సందీప్‌, ఎ.రామ్‌ చరణ్‌ 8వ తరగతి

వేమన ఇంటర్నేషనల్‌ స్కూల్‌, చిన్న దోర్నాల, దోర్నాల మండలం, మార్కాపురం జిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్