ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పుట్‌బాల్‌లో రాణిస్తున్నాం...

5 గంటల క్రితం

football
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 07:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హాయ్‌ ఫ్రెండ్స్‌..

మాకు పుట్‌బాల్‌ క్రీడ అంటే ఎంతో ఇష్టం. శారీరక, మానసిక, ఆరోగ్యానికి ఈ క్రీడ బాగా దోహదపడుతుంది. ప్రాథమిక విద్య స్థాయి నుంచే మేము ఈ క్రీడలో రాణించాలనే లక్ష్యంతో కోచ్‌ ద్వారా శిక్ష‍ణ పొందుతున్నాం. ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పుట్‌బాల్ జూనియర్ బాలుర విభాగంలో మంచి ప్రతిభను చూపించాం. అందుకే మమ్మల్ని మా జిల్లా తరపున రాష్ట్ర స్థాయిలో జరిగే పుట్ టోర్నమెంట్‌కు కూడా ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయికి మేము ఎంపికయ్యేందుకు శిక్ష‍ణ ఇచ్చిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, పోటీల్లో ప్రతిభ కనబర్చిన మమ్ములను పాఠశాల ప్రిన్సిపాల్ రెవ. బ్రదర్. యేసు ప్రభాకరన్, డైరెక్టర్ రెవ. బ్రదర్. బాలశౌరి, వైస్ ప్రిన్సిపాల్ రెవ. బ్రదర్. భల్లా జోసఫ్, రెవ. బ్రదర్. జిమ్మికురియోకోస్, రెవ. బ్రదర్. జరోమియోస్, ఉపాధ్యాయ బృందం, మా తోటి విద్యార్థినీ విద్యార్థులు అభినందించటం హ్యాపీగా ఉంది. క్రీడల ద్వారా మాలో క్రమశిక్షణ పెరిగింది. జట్టు భావనను మరింత పెంపొందించుకున్నాం. మేము చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి, మా పాఠశాలకు మంచిపేరు తీసుకురావడం పట్ల పాఠశాల యాజమాన్యం, మా తల్లిదండ్రులు కూడా అభినందించటం మాకెంతో సంతోషంగా ఉంది. మమ్మల్ని అభినందించటమే కాకుండా పుష్పగుచ్ఛాలు అందించి, శుభాకాంక్షలు తెలియజేయటం మా జీవితంలో మరపురాని సంఘటనగా భావిస్తున్నాం. భవిష్యత్తులోనూ మరిన్ని క్రీడా పోటీల్లో పాల్గొని, అత్యుత్తమ ప్రతిభతో విజయాలు సాధిస్తాం. మంచి క్రీడాకారులుగా తయారుకావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. తొమ్మిదొవ యూత్ ఇంటర్ డిస్ట్రిక్ బాస్కెట్ పోటీలకు మా పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న నీహారిక శ్రీ, 11వ తరగతి చదువుతున్న జ్వలిత, కీర్తన ఎంపిక కావటం మాకెంతో ఆనందంగా ఉంది.

సి.శశాంక్, పి. కార్తిక్ రామ్, డుండీ

9వ తరగతి, సెయింట్ జాన్స్ ఉన్నత మాథ్యమిక పాఠశాల,

గన్నవరం, కృష్ణాజిల్లా.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్