ఆరోజు స్కూల్ లో 9వ తరగతి వార్షిక ఫలితాలు వెలువడ్డాయి. సన్నీ (అలియాస్ వంశీ కృష్ణ) బార్డర్ మార్కులతో 10వ తరగతికి ప్రమోట్ అయ్యాడు. వచ్చేది పబ్లిక్ ఎగ్జామ్స్ ఇయర్. ఇలా అయితే టెన్త్ క్లాస్ లో పాస్ అవ్వడం కష్టమే. ‘ కలెక్టర్ కావాలని’.. అమ్మ నాన్న అతని మీద ఆశలు పెంచుకున్నారు. కాని గత రెండు సంవత్సరాలుగా మొబైల్ లోకంలో పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు. చాలాసార్లు దండించారు. బెదిరించారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇలా సెల్ ఫోన్ ఫోబియాలో పడి చదువు పట్ల అశ్రద్ధ చూయించడం అందరిముందు వారికి తల తీసేసినట్టయింది.
‘‘మీ సన్నీ.. క్రికెట్, మొబైల్.. పిల్లలతో షికార్లు చేస్తూ, అల్లరి చేస్తూ అందరినీ భయపెడుతున్నాడని’’... స్కూల్ మానేజ్మెంట్ కూడా టి సి ఇచ్చి పంపిస్తామని చాలాసార్లు పిలిచి చెప్పారు.. పేరెంట్స్ బతిమాలడంతో స్కూల్ లో కొనసాగుతున్నాడు. ఇక లాభం లేదు.. అని తెలిసి డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ కి తీసుకెళ్లారు..
డాక్టర్ అతనిని ఒక రూమ్ లో కూర్చోబెట్టి, ఆ రూమ్ లో గోడలకి ఫిక్స్ చేయబడిన కొన్ని ఫొటోస్ ని చూడమని చెప్పి ఒక అసిస్టెంట్ ని పెట్టారు. ఆ తరువాత తల్లితండ్రులతో మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకొని, ఒక కంక్లూజన్ కి వచ్చి ఆ పిల్లవాడిని తన కన్సల్టెన్సీ రూమ్ లోకి పిలిచాడు.
ఆ తరువాత కొన్ని ప్రశ్నలు అడిగి, కొంత సమాచారం రాబట్టా సన్నీ ని
డాక్టర్ అడిగాడు.'." నీవు ఏం కావాలని అనుకుంటున్నావు.." అని.
'కలెక్టర్ ' అని టక్కుమని జవాబు చెప్పాడు,ఆ అబ్బాయి. 'మరి నీకు బాగా ఎవరంటే ఇష్టం! " మళ్ళీ అడిగాడు డాక్టర్.
డాక్టర్ ప్రశ్న పూర్తి కాకుండానే ఆతృతతో "అబ్దుల్ కలాం "అని చెప్పాడు..అంతకుముందు తను చూసిన ఫొటోలలో ఉన్న అబ్దుల్ కలాం, శాస్త్రవేత్తని, మాజీ రాష్ట్రపతి, ప్రజల గుండెల్లో కొలువైన ఒక గొప్ప నాయకుడు, లెజెండ్ రైటర్ ఫోటో చూసి మురిసిపోయి.. అది గుర్తుకు తెచ్చుకొని.
'మరి అబ్దుల్ కలాం గురించి తెలుసా నీకు అడిగాడు.. డాక్టర్ మళ్ళీ..
' 'లేదు కాని ఇష్టం..' అని చెప్పాడు.. ఆ అబ్బాయి.
"అయితే విను.. కలాం గారు.. చిన్నప్పుడు పేపర్ వేసేవాడు.. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేక.. వీధి దీపాల క్రింద కూర్చొని చదివాడు.. అలా చదువు మీద దృష్టి పెట్టి గొప్ప చదువులు చదివి సైంటిస్ట్ అయ్యాడు. ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యాడు.." అంటూ అబ్దుల్ కలాం జీవితం గురించి ఆ పిల్లవాడికి అర్థమయ్యే రీతిలో వివరించాడు ఆ డాక్టర్.
'అవునా డాక్టర్ అంకుల్..' డాక్టర్ చెప్పిన విధానానికి ఇన్ స్ఫైర్ అయి సన్ని ఆశ్చర్య పోయాడు.
'ఆవును. నీకు అలా కష్టాలు ఉన్నాయా..?' అని తిరిగి డాక్టర్ అడిగితే
'లేవు.. " అని తలూపాడు సన్నీ.
"మరి నీవు కలెక్టర్ కావాలంటే బాగా చదవాలి.. క్రికెట్, మొబైల్.. అన్నీ అవసరం.. కానీ అది వ్యసనం కాకూడదు..
నీవు గొప్పోడివి అయ్యాక నీకు అందరూ చాలా రెస్పెక్ట్ ఇస్తారు.. నీవు కూడా కలెక్టర్ అయితే నేను కూడా నీ దగ్గర కి వచ్చి కంగ్రాట్స్ చెపుతాను.. మా ఫ్రెండ్ కొడుకు చాలా ఉన్నత స్థాయి పదవిలో ఉన్నాడని గర్వ పడతాం'" .. అని అనగానే...
డాక్టర్ చెప్పిన మాటలకు స్పందించి, వారి కౌన్సెలింగ్ కి రెస్పాండ్ అయి, తానేమిటో అర్థం అయ్యాక.. ఆ అబ్బాయి తల్లితండ్రితో
"సారీ అమ్మ.. సారీ డాడ్.. ఇక నుండి బుద్ధిగా చదువుకొని, మంచి మార్కులు తెచ్చుకుంటూ, తప్పకుండా అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకొని కలెక్టర్ అయి మీ కోరిక తీరుస్తాను. ప్రజలకు సేవ చేస్తాను.." అని వాళ్ళ దగ్గరికి వచ్చాడు.
'థాంక్ యూ డాక్టర్ అంకుల్.. నాకు కనువిప్పు కల్గించి నా భవిష్యత్తు మీద ఆశ కల్పించినందుకు..'
అనగానే సన్నీ కి షేక్ హ్యాండ్ ఇచ్చి 'అల్ ది బెస్ట్' చెప్పాడు. డాక్టర్ సుధాకర్.
కొడుకులో వచ్చిన "మార్పు" కి సంతోషంతో ఇంటికి బయలుదేరారు సన్నీ అమ్మ, నాన్నలు.
దారిలో..
సన్నీ కి ఇష్టమైన హైదరాబాద్ బిర్యానీ, హల్వా, ఐస్‌క్రీమ్ ని ప్యాక్ చేయించారు.
వాళ్లలో కల్గిన సంతోషాన్ని గమనించిన సన్నీ ఇద్దరిని గట్టిగా హగ్ చేసుకొని ముద్దులు ఇచ్చాడు.
అప్పుడే ఆకాశం వాకిట్లోకి అడుగుపెట్టిన చిరునవ్వుల నెలవంక తొంగి చూసింది.
కొండ రవీందర్
9059237771







కామెంట్‌లు (0)