ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅండగా నిలుద్దాం

51 నిమిషాల క్రితం

అండగా నిలుద్దాం .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 07:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

​మనిషి కోసం మనిషి నిలబడిన చోట

మానవత్వం చిరునవ్వుతుంది...

కన్నీటిని చూసి

కళ్లు తడవడమే కాదు

ఆ కన్నీటిని తుడిచే చేయి కావాలి...

ఆకలిని చూసి జాలిపడటమే కాదు

ఒక ముద్ద అన్నం అందించే మనసు కావాలి...

ఆపదలో ఉన్నవారిని చూసి

అయ్యో అనడం కాదు

అండగా నిలిచే అడుగు కావాలి...

అదే సేవ...

అదే మానవత్వం...

అదే మనిషితనం!

స్వార్థపు గోడలను కూల్చి

‘నేను’ నుంచి ‘మనం’ వైపు

మనసులను నడిపించే

సేవా బాటే ఎన్‌ఎస్‌ఎస్‌ బాట...

ప్రతిఫలం ఆశించని చేయి

నిజమైన సేవా చేయి...

ఎవరూ చూడని వేళ

ఎవరికోసం చేసిన సహాయం

నిజమైన మానవత్వం...

సేవ అంటే

మనిషి పక్కన

మనిషిగా నిలబడటం...

వృద్ధుడి ఒంటరితనంలో

ఒక పలకరింపుగా...

పేదవాడి జీవితంలో

ఒక ఆశాకిరణంగా...

ప్రకృతి గాయాల్లో

ఒక పచ్చని మొక్కగా...

ఆపదలో

ఒక ధైర్యపు మాటగా...

​డాక్టర్ పుల్లేటికుర్తి ఎస్.వి.శ్రీనుబాబు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్