మనిషిగా పుట్టడం సహజం
మనిషిగా జీవించడం ఒక బాధ్యత
ఎదుటివారి కన్నీటిని
మన కన్నీటిగా భావించగలిగితే
అదే నిజమైన మనిషితనం
ఆకలితో ఉన్నవాడికి
ఒక ముద్ద అన్నం పెట్టడం
ఆపదలో ఉన్నవాడికి
ఒక చేయి అందించడం
అదే మానవత్వం
కులం, మతం, ప్రాంతం దాటి
మనిషిని మనిషిగా చూడగలిగితే
ప్రేమ పంచిన చోట
ద్వేషానికి చోటుండదు
మనిషి కోసం మనిషి నిలబడినప్పుడే
ఈ సమాజం నిజమైన మానవ సమాజమవుతుంది.
జిఎన్‌ఎల్‌జి కాత్యాయని







కామెంట్‌లు (0)