శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలంగాణలో సర్ ప్రక్రియ 60 శాతం పూర్తి : ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి

12 గంటల క్రితం

60% of the survey process in Telangana completed: Election Commissioner Sudarshan Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 02:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకూ సర్ ప్రక్రియ 60 శాతం డిజిటైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని సుల్తాన్పూర్, ఐలాపూర్, పటాన్ చెరులో బీఎల్వోలు నిర్వహిస్తున్న సర్ శిబిరాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. సర్ ప్రక్రియపై బీఎల్వోలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. శిబిరాల వద్ద వివిధ పార్టీలకు చెందిన వారు ఉండటాన్ని గమనించి మీకు పార్టీ నుంచి గుర్తింపు కార్డులు ఏమైనా ఇచ్చారా ? అని ప్రశ్నించారు. సర్ గడువు పొడిగింపు తేదీని దృష్టిలో పెట్టుకొని ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం, పట్టణ ప్రాంతాల్లో 45 శాతం అయిందని తెలిపారు. పీఎల్వో, బీఎల్వోల సహకారంతో సర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఎన్యూమరేషన్ పత్రాలు అందకపోతే సూపర్ వైజర్‌లను అడిగి తీసుకోవాలని సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్