mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఎసిబి సోదాలు

2 రోజుల క్రితం

ACB raids the residence of Land and Survey Deputy Director Narahari.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 16, 2026, 10:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి లక్ష్యంగా ఎసిబి అధికారులు మంగళవారం ఉదయం నుంచి విస్తృత తనిఖీలు చేపట్టారు. నగరంలోని నరహరి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఆఫీసులు, బంధువులు, అత్యంత ఆప్తుల ఇళ్లలో ఎసిబి బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని దాదాపు 10 విభిన్న ప్రాంతాలలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. నరహరి తన అధికారిక ఆదాయానికి మించి భారీగా అక్రమ ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలపై ఎసిబి ఈ చర్యలు చేపట్టింది. ఈ తనిఖీల్లో కీలకమైన భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, నగదు, బంగారు ఆభరణాలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాలు ముగిసిన తర్వాత పట్టుబడిన అక్రమ ఆస్తుల పూర్తి వివరాలను, వాటి మార్కెట్ విలువను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్