తెలంగాణ : ఎపి లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి ని ఇడి అధికారులు గురువారం అరెస్టు చేశారు. లిక్కర్ స్కాం కేసులో భాగంగా … ఈ రోజు ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ సహా 10 ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఆరుగురి ఇండ్లలో కూడా ఇడి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎపి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లోనూ దాడులు కొనసాగుతున్నాయి. ఎపి మద్యం కుంభకోణంలో రూ.వేల కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. హవాలా, మనీలాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లు ఇడి కూడా గుర్తించింది. ఈ క్రమంలో రాజ్‌కెసిరెడ్డి ని ఇడి అరెస్ట్ చేసింది. గతంలో ఎపి పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)దాఖలు చేసిన నివేదికల ఆధారంగా …. ఇడి ఈ మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. మద్యం కంపెనీల నుంచి ముడుపుల రూపంలో వసూలు చేసిన సుమారు రూ.3,500 కోట్ల అవినీతి సొమ్ము బినామీ సంస్థలు, షెల్ కంపెనీలు, హవాలా నెట్‌వర్క్ ద్వారా రియల్ ఎస్టేట్, జ్యువెలరీ రంగాల్లోకి మళ్లిందనే ఆరోపణలతో ఈ దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సోదాల్లో కీలక డిజిటల్ డివైజ్‌లు, బ్యాంక్ లావాదేవీల పత్రాలు, భారీ ఆస్తుల డైవర్షన్ డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడులకు సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు ఇడి నుంచి ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
Scam – ఎపి లిక్కర్ స్కాం కేసు – రాజ్‌కెసిరెడ్డి అరెస్ట్
11 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 11, 2026, 11:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)