mh ad
శుక్రవారం, 26 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాతబస్తీ గోల్డ్ మ్యాన్ పై కేసు నమోదు

11 గంటల క్రితం

gold man arrest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 12:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : పాతబస్తీ గోల్డ్ ‌మ్యాన్‌గా పేరు పొందిన పల్లపు సురేష్ ‌కుమార్‌ అలియాస్‌ సూర్యాభాయ్ ‌పై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు తాను సన్నిహితుడినంటూ సూర్యాభాయ్‌ నమ్మించాడని, తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానంటూ రూ.30 లక్షలు తీసుకుని మోసం చేసినట్టు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బంగారం ఇవ్వకుండా, డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో ఇంటికి వెళ్లి నిలదీస్తే 3 ఐఫోన్లు, రూ.20 లక్షల చెక్ ఇచ్చి పంపించాడని, ఆ తర్వాత తమను బెదిరించి మళ్లీ ఫోన్లు తీసుకెళ్లారని పోలీసులకు తెలిపారు. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన అత్తాపూర్‌ పోలీసులు.. కేసును నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్