తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో అదనంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రబీకి సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. సవరించిన అంచనాల ప్రకారం .... సేకరణ మొత్తం 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలుకు నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లు పెంచినందుకు ప్రధాని మోడి, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషికి రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణలో అదనంగా ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
11 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 22, 2026, 03:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)