ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఎం సన్నిహితుడు గెస్ట్‌ హౌస్‌కు రమ్మన్నాడు : మహిళా వ్యాపారవేత్త ఆవేదన

1 గంట క్రితం

CM's close associate asked me to come to the guest house: Woman entrepreneur's anguish
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 04:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్ కోసం తాను న్యాయబద్ధంగా అవకాశం ఇవ్వమని అడిగితే, సిఎంకు సన్నిహితుడైన ఒక వ్యక్తి గెస్ట్ హౌస్‌కు రావాలని పిలిచాడంటూ కె.శోభా రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆమె పోస్టు చేశారు. సాయం కోరితే తనను ముఖ్యమంత్రి సన్నిహితుడు గెస్ట్ హౌస్‌కు రమ్మని పిలిచాడని ఆమె వాపోయారు. తాను ఎవరి పేర్లు చెప్పలేను కానీ ఇలాంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. సదరు వ్యక్తి మాట్లాడుతూ ... సిఎం అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తే నాకేంటి.. ? గెస్ట్ హౌస్‌కు రా, కనీసం నా BMW కారులో 15 నిమిషాలు నన్ను ఆనందపరుచు అంటూ సిఎం సన్నిహితుడు వేధించాడని ఆమె పేర్కొన్నారు. అవసరమైతే వీధుల్లో ముష్టి ఎత్తుకుని బతుకుతాను కానీ పని కోసం ఇలాంటి తప్పుడు పనులు చేయను అని బదులు ఇచ్చాను అంటూ కె.శోభా రెడ్డి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్