తెలంగాణ : నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ కావడంతో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మోడల్ స్కూల్‌లో ఇంటర్ చదువుతున్న బాలికలకు మధ్యాహ్నం భోజనం అనంతరం కడుపు నొప్పి వచ్చింది. గమనించిన స్కూల్ సిబ్బంది వెంటనే స్థానిక హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. నొప్పి తీవ్రంగా ఉన్న మరో 15 మంది విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం జిల్లా హాస్పిటల్‌కు తరలించారు.
స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ - 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 04:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)