సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నాంపల్లి కోర్టుకు మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు

1 గంట క్రితం

Former Minister Karumuri Nageswara Rao at Nampally Court.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 12:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఇడి కార్యాలయం నుంచి అధికారులు నాంపల్లి కోర్టుకు తరలించారు. అంతకుముందు గాంధీ ఆస్పత్రిలో కారుమూరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్‌కుమార్, వాసుదేవ రెడ్డి, రాజ్‌కెసిరెడ్డి ని పోలీసులు అరెస్టు చేశారు. మద్యం రవాణా కాంట్రాక్టులో భారీగా అక్రమాలు జరిగాయని, అందులో పెద్దమొత్తం లబ్ధి పొందినట్లు ఇడి అధికారులు తెలిపారు. సునీల్‌కుమార్ ఇంట్లో రోలెక్స్ వాచీలు, రేంజోరోవర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే కారుమూరికి చెందిన రూ.87.7 కోట్ల ఆస్తులను ఇడి జప్తు చేసింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్