తెలంగాణ : ఫార్ములా ఈ-కార్ రేసులో తదుపరి విచారణను ఎసిబి ప్రత్యేక కోర్టు ఆగష్టు 25 కి వాయిదా వేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కెటిఆర్ శుక్రవారం నాంపల్లి ఎసిబి కోర్టుకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి మార్చి 23 న 77 పేజీల చార్జిషీట్ దాఖలు చేసిన ఎసిబి.. 14 మంది సాక్షులను పేర్కొంది. కెటిఆర్‌తో సహా ఐదుగురిపై అభియోగాలు మోపడంతో కోర్టు విచారణకు కెటిఆర్ హాజరయ్యారు. కెటిఆర్ తో పాటు ఐఎఎస్ అర్వింద్ కుమార్ (A2), హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి ఈరోజు ఉదయం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. వీరితోపాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో కొద్ది సేపు ట్రాఫిక్ స్తంభించింది. ఫార్ములా-ఈ రేస్, ట్రాక్, ఇతర ఖర్చుల పేరిట హెచ్‌ఎమ్‌డీఏ నిధుల నుంచి రూ.55 కోట్లకు పైగా వ్యయం చేశారని ఆరోపణ ఉంది. అధికారిక రికార్డులు లేకుండా ఖర్చులు చేసి ఆడిట్‌ను తప్పించేందుకు ప్రయత్నించారని ఎసిబి అభిప్రాయపడింది. మూడు సీజన్ల ఖర్చును ఒకే రేసుకు చూపి కేబినెట్ ఆమోదం పొందకుండా తప్పించుకున్నారని ఆరోపణ ఉంది. ఆర్‌బిఐ నిబంధనలు, పన్ను విధానాలను ఉల్లంఘించి విదేశీ సంస్థలకు నిధులు బదిలీ చేశారని ఎసిబి అభియోగం. పన్నుల రూపంలో ప్రభుత్వంపై రూ.8.06 కోట్ల అదనపు భారం పడిందని ఎసిబి పేర్కొంది. కెటిఆర్, అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు అవసరమైన అనుమతులు లభించిన అనంతరం చార్జిషీట్ దాఖలైంది.
ఫార్ములా ఈ-కార్ రేసు విచారణ వాయిదా - ఎసిబి కోర్టుకు కెటిఆర్
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 31, 2026, 12:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)