mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలంగాణలో భారీ వర్షాలు :వాతావరణ శాఖ

09 జూన్, 2026

Heavy rains in Telangana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 09, 2026, 04:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ :   తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.  గంటకు 40 నుంచి 50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.  ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉందని ప్రకటించింది.  బుధవారం వికారాబాద్, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ,  ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్