మంచిర్యాల (తెలంగాణ) : మంచిర్యాల జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నస్పూర్ మండల కేంద్రంలో ఆటో రోడ్డును దాటుతుండగా, ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడే చనిపోగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. మృతులు మందమర్ని మండలం పొన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి, వెంకటాపూర్‌కు చెందిన అగ్గు సౌందర్య, సోనియా , సుమలతగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. ప్రమాద స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్, ఏసీపి ప్రకాష్ సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను సిపి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంపై మంత్రి గడ్డం వివేక్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వీరంతా తన నియోజకవర్గానికి చెందినవారని తెలిపారు. వృద్ధుల కుటుంబాలకు తక్షణసాయంగా రూ.25 వేలు, గాయపడినవారికి రూ.10 వేలు అందిస్తున్నట్లు ప్రకటించారు.
ఆటోను ఢీకొట్టిన లారీ - నలుగురు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 05:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)