సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్- 30న మారేడుమిల్లిలో వుడెన్ బ్రిడ్జి, ట్రీ హౌస్ ప్రారంభం

1 గంట క్రితం

ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్
30న మారేడుమిల్లిలో వుడెన్ బ్రిడ్జి, ట్రీ హౌస్ ప్రారంభం
 పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు ఆహ్వానం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 05:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రాజవొమ్మంగి

ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు పోలవరం జిల్లా మారేడుమిల్లి ముస్తాబవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మారేడుమిల్లిలోకాఫీ తోటల మధ్య ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన వుడెన్ బ్రిడ్జి (చెక్క వంతెన), ట్రీ హౌస్‌‌తోకూడిన నూతన ఎకో టూరిజం ప్రాజెక్ట్ ఈనెల 30న ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సోమవారం రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌‌ను ఫారెస్ట్‌ డివిజనల్ మేనేజర్ కోన జయశ్రీ, రేంజ్ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి ప్రాజెక్ట్ విశేషాలను వివరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రిని ఆహ్వానించారు.

పచ్చని అడవులు,జలపాతాలు,ప్రకృతి అందాల నడుమ నిర్మించిన వుడెన్ బ్రిడ్జి,ట్రీ హౌస్ పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందించనున్నాయని మంత్రికి అటవీ అధికారులు వివరించారు. పర్యావరణ హితంగా రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా అటవీ సౌందర్యాన్ని పర్యాటకులకు మరింత చేరువ చేయడంతో బాటు మారేడుమిల్లి ప్రాంతంలో ఎకో టూరిజానికి మరింత ఊతం లభించనుందని తెలిపారు.ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే పర్యాటకులు, కుటుంబ సమేతంగా మారేడుమిల్లిని సందర్శించి ఈ నూతన పర్యాటక ప్రాజెక్ట్‌ను ఆస్వాదించాలని అటవీ శాఖ అధికారులు కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్