సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముగిసిన జిల్లా స్థాయి చెకుముకి సంబరాలు

1 గంట క్రితం

ముగిసిన జిల్లా స్థాయి చెకుముకి సంబరాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 05:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి సంబరాలు అత్యంత విజ్ఞాన దాయకంగా గాజువాక సంసిద్ధి ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 108 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల నుండి 364 మంది 8, 9, 10 తరగతుల విద్యార్థులు, 150 మంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి చెకుముకి పరీక్షతో పాటు ప్రిలిమినరీ పరీక్ష, వక్తృత్వ పోటీలు, సాంస్కృతి కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వ పాఠశాల నుండి పెదగంట్యాడ మండలం నడుపూరు జడ్‌‌పి హైస్కూల్ విద్యార్థులు ఎన్.గీతిక, ఎన్.సనా, బిఎం.గుప్తా ఎంపిక కాగా ప్రైవేటు పాఠశాల నుండి గాజువాక మండలం కూర్మన్నపాలెం కెకెఆర్ గౌతమ్ స్కూల్ నుండి జయంత్, రోనక్ రాజ్, ధనుష్ ఎంపికయ్యారు. నవంబర్‌‌లో జరగనన్న రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పొల్గొననున్నారు. ప్రభుత్వ పాఠశాల నుండి జిల్లా స్థాయి ద్వితీయ, తృతీయ స్థానాలకు జడ్‌‌పి హైస్కూల్ ఇస్లాంపేట, జడ్‌‌పి హైస్కూల్ మింది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రైవేట్ పాఠశాల నుండి పెందుర్తి మండలం బాలాజీ హై ఫీల్డ్, గాజువాక మండలం నుండి స్కూల్ ఆఫ్ కిడ్స్ విద్యార్థులు ద్వితీయ, తృతీయ స్థానాలు

గెలుపొందారు.

వ్రక్తృత్వ పోటీలలో జిల్లా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు కెకెఆర్ గౌతమ్ స్కూల్ నుండి గౌతమ్, పెందుర్తి ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్ నుండి కె.దినేష్, తగరపువలస తిరుమల స్కూల్ నుండి కె.లక్షిత గెలుపొందారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ, ప్రపంచ గమనాన్ని నిర్దేశించేది సైన్సు అని అన్నారు. ఒక శాతం ప్రేరేపించ గలగడం, 99 శాతం ప్రత్యక్షంగా పాల్గొనప్పుడే విజయం సాధిస్తామని చెప్పారు. సైన్స్ లో అబ్జర్వేషన్, ఎనాలసిస్, థింకింగ్ ఈ మూడు చేయగలిగితే అద్భుతాలు సాధించవచ్చన్నారు. జెవివి చేపట్టిన ఈ కార్యక్రమాలతో సమాజానికి, విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. జెవివి జిల్లా గౌరవాధ్యక్షులు డాక్టర్ ఎన్.చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ, కంచరపాలెం, పెందుర్తి పాలిటెక్నికల్ కళాశాలల ప్రిన్సిపల్స్‌ కెవి.రమణ, ఎ.గోపి, సంసిద్ధి స్కూల్ ప్రిన్సిపల్ పి.కృష్ణారెడ్డి, గాజువాక, ములగాడ ,పెదగంట్యాడ మండలాల విద్యాశాఖ అధికారులు, వెంకట త్రినాధరావు, రమణాజీ, డాక్టర్ రమేష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి విచేసిన అతిథులను స్వామి విద్యానికేతన్ స్కాట్ విద్యార్థులు మెయిన్ గేట్ నుండి స్వాగతం పలుకుతూ వేదికవద్దకు తోడ్కొని రావడం ప్రత్యేక ఆకర్షణగా జరిగింది.

ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి వైఎఆర్‌‌కె. ప్రసాద్, ఉపాధ్యక్షులు లక్ష్మణస్వామి, కార్యదర్శి ఎస్‌‌వికె.పరశురాం, జెవివి సీనియర్ నాయకులు పివి.గోపాలరావు, వైవి.రత్నారావు, ఎస్‌‌విరమణ, శ్రీకాంత్, డాక్టర్ కెఆర్.తినాధరావు, కెవి.సత్యనారాయణ, కెవి. ప్రసాద్, ఎ.వాసుదేవరావు, ఎం సింహాచలం, ఎం. రామకృష్ణ, ఎ.సుధాకర్,ఇందు శ్రీనివాస్, ఎ.చంద్రశేఖర్, డాక్టర్ శ్రీనివాస్, పిడి. ప్రసాద్ పాల్గొన్నారు.

ఫోటో, బహుమతులు అందజేస్తున్న నగర పోలీస్ కమిషనర్,

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్