ప్రజాశక్తి-రొద్దం
మండలంలోని కోగిర జడ్పీ హైస్కూల్ విద్యార్థిని బజరంగి మైత్రి రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం హరికిరణ్, పిడి మహేష్ తెలిపారు. కోగిర జడ్పీ హైస్కూల్‌లో సోమవారం హెచ్‌ఎం, ఉపాధ్యాయ బృందం మైత్రిని అభినందించారు. హెచ్‌ఎం మాట్లాడుతూ మైత్రి 9వ తరగతి చదువుతోందన్నారు. ఈ నెల 24వ తేదీ అనంతపురంలోని ఆర్‌డిటి క్రీడా మైదానంలో జరిగిన పోటీల్లో ప్రతిభ చాటి జూనియర్ రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైందన్నారు. మైత్రి అక్టోబర్ 1 నుంచి 11వ తేదీ వరకూ అనంతపురం ఆర్‌డిటి స్టేడియంలో నిర్వహించే 11 రోజుల క్యాంపులో మరింత శిక్షణ పొంది, ఆ తర్వాత
13 నుంచి 16వ తేదీ వరకూ శ్రీకాకుళంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు.







కామెంట్‌లు (0)