శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వేప చెట్టు వివాదం - ఇద్దరు మృతి

1 గంట క్రితం

Neem tree dispute – Two dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 11:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

సూర్యాపేట (తెలంగాణ) : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో గొడ్డలితో దాడి చేయడంతో మంద వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మరో వ్యక్తి సైదా కూడా తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో ఎర్రగడ్డ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్