తెలంగాణ : భాగ్యనగరంలో ఎంతో ప్రత్యేకత ఉన్న బాలాపూర్ వినాయకుడి లడ్డూను రూ.39 లక్షలకు సామా ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్ గణేశుడి లడ్డూ ధర రూ.35 లక్షలు పలుకగా, ఈ సారి రూ.4 లక్షలు అదనంగా లడ్డూ ధర పలికింది. అర్బన్ గ్రూప్‌కు చెందిన ప్రణీత్ రెడ్డి లడ్డూను వేలం పాటలో దక్కించుకున్నారు. ఆయనతోపాటు వేలం పాటలో మర్రి రవికిరణ్ రెడ్డి (చంపాపేట్), కేవీఏ ఫ్లవర్ మర్చంట్- కందాడ శాలిని వీరేందర్ రెడ్డి (చంపాపేట్), కంచర్ల శివ రెడ్డి (హస్తినాపురం), ది సుషీ కో సామ దయానంద్ రెడ్డి & సామ వరణంద్ రెడ్డి(లండన్), జీఎన్ఆర్ డెవలపర్స్ - గడ్డం నవీన్ రెడ్డి (హస్తినాపురం), పీఎస్‌కే గ్రూప్ (శ్రీకాంత్), ఇబ్రాం ప్రత్యూష్ (బాలాపూర్) పాల్గొన్నారు. 21 కిలోల బాలాపూర్ గణేశుడి లడ్డూ కోసం 9 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో ఐదు కంపెనీలు ఉండటం విశేషం. కేవలం లడ్డూ కోసమే ఎన్‌ఆర్‌ఐలు బాలాపూర్‌కు తరలివచ్చారు. 1994లో లడ్డూ వేలం పాట మొదలవగా.. తొలిసారి రూ.450 ధర పలికింది. ఇక అప్పటి నుంచి లడ్డూ ధర అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది రూ.39 లక్షలకు చేరింది. లడ్డూ వేలం ముగిసిన అనంతరం బాలాపూర్ గణేశ్ విగ్రహం నిమజ్జనం ఊరేగింపు ప్రారంభమైంది. బాలాపూర్ వినాయకుడిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు.
రూ.39 లక్షలకు బాలపూర్ లడ్డూను దక్కించుకున్న ప్రణీత్ రెడ్డి
15 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 11:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)