తెలంగాణ : రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరు హత్యకేసుల హంతకుడు రాజ్‌కుమార్ మృతి చెందాడు. నిందితుడి మేనమామ ఊరు కొత్తూరు మండలం పంజర్ల సమీపంలో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. జూలై 10 న భార్య, పిల్లలతో పాటు ఆరుగురిని నిందితుడు దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పారిపోయాడు. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అతడి మృతదేహం లభించింది. రాజ్‌కుమార్ మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కనబడింది. 3 రోజుల క్రితం ఆరుగురిని రాజ్ కుమార్ దారుణంగా హత్య చేశాడు. ప్రేమ పేరుతో బాలికను రాజ్ కుమార్ వేధించాడంతో ... అతడిపై పోక్సో కేసు పెట్టారు. తనపై పోక్సో కేసు పెట్టిందని బాలిక కుటుంబంపై రాజ్ కుమార్ కక్ష పెంచుకున్నాడు. బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లిని, నానమ్మను చంపాడు. బాలికను చెరువు దగ్గరికి లాక్కెళ్లి చంపేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి భార్య, ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపాడు. ఆరుగురిని చంపిన తర్వాత పారిపోయాడు. కారులో పారిపోతూ తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని తండ్రికి ఫోన్ చేశాడు. అప్పటి నుండి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో హంతకుడి మృతదేహం కొత్తూరులో లభ్యమయ్యింది.
షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 13, 2026, 04:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)