తెలంగాణ : తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత మంగళవారం తలపెట్టిన భూగర్భగని వద్ద ‘బొగ్గుబాయి’ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గని ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కవిత, టీఆర్‌ఎస్ శ్రేణులు, కార్మిక సంఘం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేట్లను తోసుకొని కవిత, పార్టీ శ్రేణులు గని ఆవరణలోకి దూసుకెళ్లారు. ‘బొగ్గు బాయి’ కార్యక్రమంలో తమను అడుగడుగునా సింగరేణి యాజమాన్యం అడ్డుకుంటుందని, కార్మికులతో కలిసి గేట్ మీటింగ్ పెట్టుకునే హక్కు తమకు ఉందని ఈ సందర్భంగా కవిత అన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించకుండా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. అడవిలో అన్నలు లేరని సింగరేణి యాజమాన్యం కార్మికులను వేధిస్తోందన్నారు. అన్నలు తమ పార్టీలో కూడా ఉన్నారన్నారు. కార్మికులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే.. ఊరుకునే ప్రసక్తే లేదని, అవసరమైతే న్యాయపరంగా ముందుకెళతామని కవిత హెచ్చరించారు.
కవిత తలపెట్టిన ‘బొగ్గుబాయి’ కార్యక్రమంలో ఉద్రిక్తత
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 16, 2026, 11:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)