బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

TG - డయల్‌ 100 కు బై.. కొత్త నంబర్‌ వచ్చింది..!

1 గంట క్రితం

TG – Goodbye to Dial 100... a new number is here!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 12:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : తెలంగాణలో అత్యవసర సేవల కోసం ఇకపై డయల్‌ 100 స్థానంలో 112 నంబర్‌ అందుబాటులోకి వచ్చింది. పోలీస్‌ సహాయం, అంబులెన్స్‌, అగ్నిమాపక సేవలు వంటి అన్ని ఎమర్జెన్సీ సేవలకు ఇక ఒకే నంబర్‌ను వినియోగించుకోవచ్చు. బుధవారం డిజిపి సివి ఆనంద్‌ అధికారికంగా 112 సేవలను ప్రారంభించారు. ఇప్పటివరకు పోలీస్‌ సహాయం కోసం డయల్‌ 100కు కాల్‌ చేసే విధానం ఉండగా, తాజాగా దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సిస్టమ్‌ (112)ను తెలంగాణలోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర సమయంలో ప్రజలు 112కు కాల్‌ చేస్తే ... అవసరమైన సేవలను (పోలీస్‌, ఆంబులెన్స్‌, అగ్నిమాపక సేవలు) వెంటనే సమన్వయం చేసేలా వ్యవస్థను రూపొందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్