మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపోలీసుల అదుపులో ట్రైనీ ఐపిఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి

1 గంట క్రితం

High Court hearing on trainee IPS officer Uday Krishna Reddy's petition adjourned.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 10:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి హైదరాబాద్‌ బ్యూరో : ట్రైనీ ఐపిఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ శివారులో కస్టడీలోకి తీసుకొని అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జాతీయ పోలీసు అకాడమీలో తనపై వేధింపులకు పాల్పడ్డాడని మహిళా ట్రైనీ ఐపిఎస్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఉదయ్‌ కృష్ణారెడ్డిపై ఈ నెల 18న అత్తాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగికంగా వేధించడంతో పాటు.. వ్యక్తిగత వీడియోలను తన భర్తకు పంపించి ఇబ్బందులకు గురి చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా నిందితుడు పేర్కొన్న రెండు చిరునామాల్లో నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా పోలీసులకు అతడి ఆచూకీ లభించలేదు. సెల్‌ఫోన్‌ సైతం స్విచ్చాఫ్‌ వచ్చింది. దీంతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్‌ డిసిపి శ్రీనివాస్‌ తెలిపారు.కాగా, ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు నమోదైన రోజు (జులై 18న) బాధితురాలికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. మెడపై గొంతు నులిమినట్లు గాయాల ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. బాధితురాలి చెంప భాగంలో కమిలిన గాయాలను వైద్యులు గుర్తించారు. ఎడమ కాలిపైనా గాయం ఉంది. కాగా, ఉప్పరపల్లి కోర్టులో ఉదయ్‌కృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం హాజరుపరచనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్