తెలంగాణ : ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి తెలిపారు. బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్‌లో కీటో మోటార్స్ ఈవీ బస్సును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .... ప్రస్తుతం ఆర్టీసీ 1,050 ఎలక్ట్రిక్ బస్సులు నడిపిస్తోందని, పీఎం ఈ డ్రైవ్ కింద 2,200 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని తెలిపారు. ఇంటర్ సిటీ ఆపరేషన్స్‌లో 500 బస్సులు వినియోగిస్తున్నామన్నారు. వచ్చే ఐదేళ్లలో డీజిల్, పెట్రోల్ వాహనాలు భారీగా తగ్గుతాయన్నారు. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ కోసం ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోందని నాగిరెడ్డి తెలిపారు.
ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యం ఇస్తున్నాం : తెలంగాణ ఆర్టీసీ ఎండి
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 02, 2026, 05:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)