బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

22 ఎ భూముల యజమానులకు ఇబ్బందులు రానివ్వం : సిఎం రేవంత్

1 గంట క్రితం

We will not let owners of '22-A' lands face difficulties: CM Revanth
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 01:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : 22 ఎ భూముల వ్యవహారంలో యజమానులకు ఇబ్బందులు రానివ్వబోమని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటితోపాటు ఇతర ఉన్నతాధికారుల‌తో స‌మీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి .... ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. ఆస్తులు కలిగినవారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు ఉండ‌కుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ప్రైవేటు భూమి అయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. వదంతులు, కట్టుకథలను నమ్మొద్దని, దళారులను ఆశ్రయించొద్దని సూచించారు. రిజిస్ట్రేష‌న్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22-ఎ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో ప‌రిశీలించి, అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేష‌న్ వెంట‌నే చేస్తారని చెప్పారు. జిల్లా క‌లెక్టర్లు 22-ఏ జాబితా భూములను క్షుణ్ణంగా ప‌రిశీలించి, శాశ్వత ప‌రిష్కారానికి స‌రైన జాబితాను రూపొందిస్తారని చెప్పారు. అందులో ఎలాంటి త‌ప్పులు లేకుండా చూడాల‌ని, ఈ ప్రక్రియ‌ను త్వరగా పూర్తి చేయాల‌ని అధికారులను ఆదేశించారు. ప్రజ‌లు త‌మ భూ హ‌క్కుల విష‌యంలో ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేదన్న రేవంత్‌రెడ్డి.. 22-ఎ భూముల విష‌యంలో ద‌ళారులు, మ‌ధ్యవ‌ర్తుల‌ను ఆశ్రయించ‌వ‌ద్దని, పుకార్లు, క‌ట్టు క‌థ‌ల‌ను విశ్వసించ‌వ‌ద్దని సూచించారు. ప్రజ‌ల ఆస్తి హ‌క్కుల ప‌రిర‌క్షణ‌కు రాష్ట్ర ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉందని, ప్రైవేటు భూముల‌కు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వబోమని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్